గవర్నర్ దత్తత గ్రామాల ప్రగతిపై సమీక్ష
కై లాస్‌నగర్: రాష్ట్ర గవర్నర్ దత్తత తీసుకున్న ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల అభివృద్ధి పనుల ప్రగతిపై ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిశోర్ మంగళవారం రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రాజర్షి షా ఇందులో పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మాంగ్లీ, బుర్కి హాబిటేషన్లలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, బుర్కీలో అంగన్‌వాడీ భవనం, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కాగా మధ్యలో ఉన్న వాగులతో నిర్మాణానికి అంతరాయం ఏర్పడుతుందన్నారు. వాగులపై కల్వర్టులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లుగా వివరించారు. అనంతరం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఆర్ ఈఈ శివరాంను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment