కొత్త జీపీలపై ఆశలు
● జిల్లాలో పలు డిమాండ్లు ● ఇప్పటికే అధికారులకు వినతులు ● ప్రభుత్వం సైతం ప్రతిపాదనలు
బోథ్: రాష్ట్రంలో మరో 200 కొత్త గ్రామ పంచా యతీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల సుముఖత వ్యక్తం చేసింది. ఈమేరకు సన్నాహాలు సై తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏజెన్సీ జి ల్లాల్లోనే ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలోనూ పలు చోట్ల కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆయా గ్రామా ల ప్రజలు మండల, జిల్లాస్థాయి అధికా రులను కలుస్తూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.
పలు మండలాల్లో డిమాండ్లు ఇలా..
జిల్లాలో గతంలో 18 మండలాలు ఉండేవి. ప్రభుత్వం కొత్తగా సొనాల, సాత్నాల, భోరజ్ మండలాలను ఏర్పాటు చేసింది. అయితే నూతన మండలాల్లో గ్రామ పంచాయతీలు తక్కువగా ఉన్నా యి. దీంతో వాటిలో కొత్త జీపీల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
● బోథ్ మండలం నుంచి సొనాల నూతన మండలంగా ఏర్పడింది. గతంలో బోథ్‌లో 33 పంచాయతీలు ఉండగా, 12 జీపీలతో సొనాల కొత్తగా ఆవిర్భవించింది. ప్రస్తుతం బోథ్ మండలంలో 21 పంచాయతీలు ఉన్నాయి. అయి తే సొనాలలో మరిన్ని పంచాయతీలను ఏర్పా టు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇందులో టివిటిపల్లె, మామాడి గూడల పేర్లు ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి.
● తలమడుగు మండలంలో ప్రస్తుతం 28 పంచాయతీలు ఉన్నాయి. ఈ మండలంలో కొత్తగా షేర్‌గూడ, తొక్కిగూడ గ్రామాలను కలు పుతూ ఒక జీపీగా ఏర్పాటుచేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
● సిరికొండ మండలంలో ప్రస్తుతం 19 జీపీలు న్నాయి.చిన్నగోధుమల్యాలను పంచాయతీగా మార్చాలని ఇక్కడిప్రజలు కోరుతున్నారు.
నిధులు వచ్చే అవకాశం
ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్న నేపథ్యంలో ఇందులో ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చాలాచోట్ల ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో మూడు, నాలుగు వరకు అనుబంధ గ్రామాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు సరిపోవడం లేదు. కొత్త జీపీలు ఏర్పడితే నిధులు ఎక్కువగా సమకూరి ప్రగతి మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయా గ్రామస్తులు తమ గ్రామాలను పంచాయతీలుగా మార్చడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులను కలుస్తున్నారు.
త్వరలోనే నోటిఫికేషన్?
కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురానుంది. గవర్నర్ ఆమోదించిన తరువాత నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కాగా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొత్త పంచాయతీలకు సైతం ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో పాత మండలాలు : 18
కొత్త మండలాలు : 03
మొత్తం : 21
గ్రామ పంచాయతీలు : 468
గ్రామాలు : 508
కొత్తగా ఏర్పడిన సొనాల మండల పరి ధిలోకి వచ్చే పలుగ్రామాలను పంచాయతీలుగా ఏర్పా టు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత కు బుధవారం వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. టివిటిపల్లె, పరుపుల పల్లెను కలిపి గ్రామ పంచాయతీగా, అలాగే మామిడిగూడ, గొల్లాపూర్, గొల్లాపూర్ తండాను కలిపి మరో పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment