మహిళా సాధికారతే లక్ష్యం●
● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● వీసీలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్‌టౌన్: మహిళా సాధికారతే ప్రభు త్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్‌పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఐదేళ్లలో మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాలతో వ్యాపారాలు,రుణ ప్రణా ళిక వసతులు కల్పించాలని ఆదేశించారు. త్వరలో టెండర్లు ఖరారు చేయాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 10 ఎకరాల వరకు భూ మిని గుర్తించినట్లు తెలిపారు. వాటికి ఎన్‌వోస్ పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. బ్యాంక్ లింకేజీని త్వరలో ఎల్డీఎంతో సమావేశం నిర్వహించి పూర్తి చేస్తామన్నారు. ఐటీడీఏకు సంబంధించి 1.90 ఎకరాలకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జేఆర్ చౌహాన్, అధికారులు పాల్గొన్నారు.
సంక్రాంతి తర్వాత అర్జీల స్వీకరణ
ఆదిలాబాద్‌టౌన్: సీఎం ప్రజావాణిలో భాగంగా మండలాల వారీగా సంక్రాంతి తర్వాత అర్జీ ల స్వీకరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ మేరకు జెడ్పీ సమావేశ మంది రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంపీడీవో ల కు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖలకు సంబంధించిన అర్జీలను ఆన్‌లైన్‌లో పొందుపర్చి దరఖాస్తుదారులకు రశీదు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధి కారి శ్రీధర్‌స్వామి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజ లింగు తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
ఆదిలాబాద్: రక్తదానం ప్రాణదానంతో సమానమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జాతీయ రహదారి భద్రత మా సోత్సవంలో భాగంగా స్థానిక ఆర్టీసీ డిపోలో బుధవారం నిర్వహించి న రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మా ట్లాడారు. డ్రైవర్లు భద్రత నియమాలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయాలన్నారు. ఇందులో ఆర్‌ఎం సోలోమన్, డిప్యూటీ ఆర్‌ఎంలు ప్రవీణ్ కుమార్, ప్రణీత్, డీఎం కల్పన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment