పేదలకు భరోసా కల్పిస్తాం
ఇచ్చోడ: భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేస్తామని కలెక్టర్ రాజర్షిషా హామీ ఇచ్చారు. గురువారం మండలంలోని కోకస్‌మన్నూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ భూమిలేని, కనీసం 20రోజులు ఉపాధిహా మీ పనులకు వెళ్లినవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపా రు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డు లు, రైతు భరోసా మంజూరు చేస్తామని చెప్పా రు. ప్రసుతం అర్హుల జాబితాలో పేర్లు రానివారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామసభలో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, ఈజీఎస్ ఏపీవో నరేందర్‌గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ పరిశీలన
బజార్‌హత్నూర్: మండలంలోని జాతర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ రాజర్షి షా హాజరై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. మండల ప్రత్యేకాధికారి డీసీవో మోహన్, డీపీఆర్వో తిరుమల, తహసీల్దార్ శంకర్, ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, ఏవో ఎండీ సౌద్, మాజీ ఎంపీపీ నాగోరావ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బలిరాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment