సాక్షి, ఆదిలాబాద్: రైతు చుట్టూ రాజకీయం నడుస్తోంది. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల అధ్యయనం కోసం ఆ పార్టీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యులు గల కమిటీని ని యమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటించనుంది. తొలుత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం నుంచి పర్యటించేందుకు శ్రీకా రం చుట్టనుంది. జిల్లా కేంద్రానికి కమిటీ రానుంది. దీంతో పార్టీల మధ్య వాడివేడి నెలకొంది.
ఆరోపణలు.. ప్రత్యారోపణలు
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ రైతుల కోసం చేసిందేమీ లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. వ్యవసాయానికి సంబంధించి రూ.2లక్షల వరకు పంట రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. రూ.21వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెబుతున్నారు. రుణమాఫీ కాని మిగతా రైతులకూ సాయం చేయనున్నట్లు కాంగ్రెస్ వివరిస్తున్నారు. అయితే రుణ మాఫీ పూర్తిగా జరగలేదని, అర్హులైన ఎంతో మంది రైతులు మాఫీ కోసం ఎదురుచూస్తున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ఇది అబద్ధాల ప్రభుత్వమని ఆరోపిస్తోంది.
జిల్లా కేంద్రం నుంచి ప్రారంభం
జిల్లా కేంద్రంలోని కిసాన్‌చౌక్‌లో ఉదయం 11గంట లకు రైతు విగ్రహానికి పూలమాలలు వేసి అధ్యయ న కమిటీ సభ్యులు పర్యటన ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బేల మండలం రేణిగుంటకు వెళ్తారు. గ్రామ రైతు జాదవ్ దేవ్‌రావు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా బాధిత కుటుంబాన్ని కమిటీ సభ్యులు ప రామర్శించనున్నారు. ఆ తర్వాత పంట చేలను సందర్శించి రైతులతో మాట్లాడనున్నారు. ఆదిలాబాద్‌రూరల్ మండలం యాపల్‌గూడలోని ఓ ఫంక్షన్‌హా ల్‌లో రైతులతో అధ్యయన కమిటీ సమావేశం కా నుంది. ఇందుకు సంబంధించిన వివరాలు మాజీ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. కాంగ్రెస్ ప్ర భుత్వం రైతులపై చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడు తూ వారికి మద్దతుగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈ క మిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందని పేర్కొన్నా రు. ఆ తర్వాత రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నట్లు తెలిపారు.
జిల్లా పర్యటన ఇలా..
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇటీవల మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్ సభ్యులుగా ఉన్నారు. బుధవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుతో కమిటీ సభ్యులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కమిటీ పర్యటన ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బస్సులో ఈ కమిటీ యాత్ర కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment