రజకుల బిల్లులు చెల్లించాలి
కై లాస్‌నగర్: రజకుల కరెంట్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. పట్టణంలోని దస్నాపూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్నిప్రమాదంలో ఇసీ్త్రషాపు కోల్పోయిన సంటెన్నకు గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రజకులకు ఉచితంగా ఇసీ్త్ర పెట్టెలు, లాండ్రి షాపులకు కరెంట్ ఇచ్చి ప్రోత్సహించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారికి ఇన్సూరెన్స్ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు కడదరపు అశోక్, జక్కుల కార్తిక్, మగ్గిడి రమేశ్, కొండూరి అశోక్, పారెల్లి భూమన్న, ఒడ్నాల పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment