సత్యవతి(ఫైల్)
రాజవొమ్మంగి: స్థానిక కన్నయమ్మపేటలో నివాసముంటున్న పాతర సత్యవతి (38) అనే గిరిజన మహిళ ప్లేట్స్‌లెట్స్ తగ్గిపోవడంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. రాజవొమ్మంగి గిరిజనసంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో కిచెన్ హెల్పర్‌గా పనిచేస్తున్న సత్యవతి నాలుగు రోజులుగా జర్వంతో బాధపడుతోంది. ప్రైవేటుగా చికిత్స చేయించుకున్నట్టు స్థానికులు తెలిపారు. మంగళవారం ఉదయం ఊపిరాడక పరిస్థితి విషమించడంతో చికిత్సకోసం రాజవొమ్మంగి పీహెచ్‌సీకు వెళ్లింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నర్సీపట్నం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స అందజేస్తుండగా ఫిట్స్ వచ్చి మరణించినట్టు బంధువులు తెలిపారు. ఈ విషయమై రాజవొమ్మంగి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ లిఖితను సంప్రదించగా సత్యవతికి టైఫాయిడ్ అని రిపోర్టు రావడంతో చికిత్స అందజేశామన్నారు. ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయని, నర్సీపట్నం రిఫర్ చేశామని తెలిపారు. సత్యవతికి డిగ్రీ చదువుతున్న కుమార్తె ఉంది. తల్లి చనిపోవడంతో భోరున విలపించింది.
Comments
Please login to add a commentAdd a comment