చిట్టిబాబుకు రెండో భార్యగా వెళ్లడం ఇష్టంలేక... | - | Sakshi
Sakshi News home page

చిట్టిబాబుకు రెండో భార్యగా వెళ్లడం ఇష్టంలేక...

Published Tue, Sep 12 2023 12:42 AM | Last Updated on Tue, Sep 12 2023 12:30 PM

- - Sakshi

హుకుంపేట: ప్రేమించిన వ్యక్తి మోసాన్ని భరించలేక, అతనికి రెండో భార్యగా వెళ్లడం ఇష్టంలేక తీవ్ర మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్యచేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీష్‌ కథనం ప్రకారం వివరాలు.. తడిగి పంచాయతీ బొడ్దాపుగ్రామానికి చెందిన పాంగి చిట్టిబాబు,శోభకోట పంచాయతీ ఈడల గొంది గ్రామానికి చెందిన మర్రి చంద్రిక(20) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నెల రోజుల క్రితం చిట్టిబాబుకు మరో యువతితో వివాహం జరిగింది. చంద్రిక అనారోగ్యంతో ఉండడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని తేలింది.

చంద్రిక కుటుంబ సభ్యులకు ప్రేమ వ్యవహారం తెలిసింది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు సుబ్బారావు, చిన్నలమ్మల ఫిర్యాదు మేరకు ఆదివారం గ్రామాల పెద్దలు విచారించి, చంద్రికను చిట్టిబాబు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. దీనికి సమ్మతించిన చిట్టిబాబు అదేరోజు సాయంత్రం చంద్రికను బొడ్దాపుట్టుకు తీసుకువెళ్లాడు. గ్రామంలో గల బంధువుల ఇంటికి చంద్రిక అదే రోజు వెళ్లింది. రెండవ భార్యగా వెళ్లడం ఇష్టంలేని ఆమె తీవ్రమనస్తాపంతో రాత్రి ఒంటిగంట సమయంలో బంధువుల ఇంటిపక్కన గల చెట్టుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

విషయాన్ని సెల్‌ఫోన్‌లో తన చెల్లికి మెసేజ్‌ పెట్టింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. చంద్రిక ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement