![నరకాసురుడి వధ ఘట్టాన్ని నిర్వహిస్తున్న అర్చకుడు
- Sakshi](/styles/webp/s3/article_images/2023/11/14/13gpl44-320077_mr_1.jpg.webp?itok=8E8EKJVp)
నరకాసురుడి వధ ఘట్టాన్ని నిర్వహిస్తున్న అర్చకుడు
సింహాచలం: నరకచతుర్దశి, దీపావళి సందర్భంగా సింహగిరిపై ఆదివారం రాత్రి నరకాసుర వధ ఉత్సవం ఘనంగా జరిగింది. రాత్రి ఆరాధన అనంతరం ఆలయ వైదికులు.. సింహాద్రి అప్పన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఒక పల్లకిలో, నరకాసురుడి విగ్రహాన్ని మరో పల్లకిలో మాడ వీధుల్లోకి తిరువీధిగా తీసుకొచ్చారు. నరకాసురుడు, స్వామి ఉత్సవమూర్తుల పల్లకీలను ఎదురుఎదురుగా ఉంచి యుద్ధ సన్నివేశాలు నిర్వహించారు. తరువాత నరకాసుర వధ జరిపారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment