ఊహించని పరిహారం | Sakshi
Sakshi News home page

ఊహించని పరిహారం

Published Mon, May 6 2024 9:25 AM

ఊహించ

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదం అత్యంత బాధాకరం. మా ప్రాణాలు పోతాయనుకున్నాం. ఈ సమయంలో ప్రభుత్వం సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. వేలాది మందికి వసతి సౌకర్యాలు కల్పించింది. ఒకవైపు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందిస్తూనే.. మరోవైపు పునరావాస కేంద్రాల్లో వారం రోజుల పాటు భోజన వసతి ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబాలన్నింటికీ ఊహించని విధంగా నష్టపరిహారం అందించింది.

– ఎస్‌.మారయ్య, పద్మనాభనగర్‌

సీఎం జగన్‌

దేవుడిలా

ఆదుకున్నారు

గ్ని ప్రమాదం కారణంగా నా బోటు దగ్ధమైంది. జీవనోపాధి దూరమై కుటుంబం రోడ్డు మీద పడిపోయిందని భయపడ్డాను. కానీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దేవుడిలా ఆదుకున్నారు. నష్టపోయిన బోటుకు 80 శాతం పరిహారాన్ని కేవలం మూడు రోజుల్లోనే ప్రభుత్వం అందించింది. ఇప్పుడు మళ్లీ కొత్త బోటును కొనుగోలు చేసుకున్నాను. ఇంత వేగంగా పరిహారం అందించిన ఏకై క ప్రభుత్వం ఇదే.

– యాగ శ్రీనివాసరావు,

బోటు యజమాని

ఊహించని పరిహారం
1/1

ఊహించని పరిహారం

Advertisement
 
Advertisement