నేటి నుంచి ఇసుక విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇసుక విక్రయాలు

Published Mon, Jul 8 2024 2:04 AM | Last Updated on Mon, Jul 8 2024 2:04 AM

-

సాక్షి,పాడేరు: ఈనెల 8వతేదీ సోమవారం నుంచి జిల్లాలోని ఎటపాక మండలంలో ఇసుక విక్రయాలు ప్రారంభిస్తున్నామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే మండలంలోని గుండాల–1, గుండాల–2 డిపోల్లో 1,66,826 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాలు, మైన్స్‌ అండ్‌ జియాలజీ కమిషనర్‌ సూచనల మేరకు జిల్లా స్థాయి కమిటీలో చర్చించి ధరపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా గిరిజన సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలు జరుపుతామన్నారు. గుండాల–1 డిపోలో 87,800 టన్నులు, గుండాల 2 డిపోలో 79.026 టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. మెట్రిక్‌ టన్నుకు రూ.300 చెల్లించి ఇసుకను పొందవచ్చన్నారు. ఇసుక కొనుగోలు చేసిన వినియోగదారుల సౌకర్యార్థం రవాణా చార్జీలు మెట్రిక్‌ టన్నుకు కిలోమీటర్‌కు రూ.5 ధర నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.

ఇసుక నిల్వల పరిశీలన

ఎటపాక: ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సోమవారం నుంచి మండలంలోని గుండాల గ్రామంలో తక్కువ ధరకు ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంటుందని చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య తెలిపారు. ఆదివారం గుండాల గ్రామంలో జాతీయ రహదారి పక్కన ఉన్న రెండు ఇసుక నిల్వలను ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఉన్న ఇసుక నిల్వలను ఆదివారం స్థానిక తహసీల్దార్‌కు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

టన్నుకు రూ.300 ధర నిర్ణయం

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement