స్నేహితుడిని హతమార్చిన ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడిని హతమార్చిన ఇద్దరి అరెస్టు

Published Sun, Oct 6 2024 2:48 AM | Last Updated on Sun, Oct 6 2024 2:48 AM

స్నేహితుడిని హతమార్చిన ఇద్దరి అరెస్టు

చింతపల్లి : మండలంలోని పెద్దబరడ పంచాయతీ చింతలూరు టేకు తోటలో జరిగిన హత్యకు సంబంధించి కేసులో నిందితులను ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌ అరెస్టు చేసినట్టు సీఐ రమేష్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. రాజమండ్రికి చెందిన దొడ్డి రాజు అర్జున్‌(50) అక్కడే ఉంటూ వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యానికి బానిస కావడంతో 20ఏళ్ల క్రితమే అతనిని భార్య, పిల్లలు వదిలి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అక్కడ వారు కూలిపనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రాజమండ్రిలోనే ఉంటున్న అర్జున్‌ అదే ప్రాంతానికి చెందిన మరో వడ్రంగి కార్మికుడు వెంకటేష్‌, ఆటో డ్రైవర్‌ పుష్పరాజ్‌తో స్నేహం చేశాడు. వీరి ముగ్గురు తరచూ మద్యాన్ని సేవించేవారు. రాజమండ్రి ప్రాంతంలో కూలిపనులు దొరకడం లేదని వెంకటేష్‌ చెప్పడంతో ఆ ముగ్గురు కలిసి రాజమండ్రిలోని ఇంటీరియర్‌ డెకరేషన్‌ యజమాని లక్ష్మణరావును ఉపాధి కోసం గత నెల 26న కలిశారు. అతని నుంచి ముగ్గురు మూడు విజిటింగ్‌ కార్డులు తీసుకున్నారు. అనంతరం వారు గత నెల 27న అక్కడి నుంచి మండలంలోని చింతలూరు బయలుదేరారు. మార్గం మధ్యలో లోతుగెడ్డ జంక్షన్‌ వద్ద ముగ్గురూ పూటుగా మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. మద్యం మత్తులో పుష్పరాజ్‌, వెంకటేష్‌ను అర్జున్‌ తిట్టి అవమానపరిచాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు అర్జున్‌ను అక్కడి నుంచి చింతలూరు తోట వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పూటుగా మద్యం తాగించి అర్జున్‌ తలపై బండరాయితో మోదారు. దీంతో తీవ్రంగా గాయపడిన అర్జున్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనిని అక్కడ వదిలి వెళ్లిపోయారు. దీనిపై అప్పటిలో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని వద్ద లభించిన ఇంటీరియర్‌ డెకరేషన్‌ యజమాని లక్ష్మణరావు విజిటింగ్‌ కార్డు ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. అతని వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. అర్జున్‌, వెంకటేష్‌, పుష్పరాజ్‌ వచ్చిన విషయాన్ని అతను చెప్పాడు. దీని ఆధారంగా కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో వెంకటేష్‌, పుష్పరాజ్‌ డౌనూరులో మద్యం సేవిస్తుండగా పట్టుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. మిస్టరీగా మారిన కేసును ఛేదించిన ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌, సిబ్బందిని ఆయన అభినందించారు.

విజిటింగ్‌ కార్డు ఆధారంగా కేసు మిస్టరీని

ఛేదించిన పోలీసులు

ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌, సిబ్బందిని అభినందించిన సీఐ రమేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement