పాడేరు : విద్యార్థుల ప్రాథమిక దశ నుంచి క్రీడలపై మక్కువ పెంచుకుని సత్తా చాటి జిల్లాకు గుర్తింపు తేవాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ అండర్ 14,17,19 అంతర్ జిల్లాల థాంగ్ టా మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్ జిల్లాల పోటీలు పాడేరులో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలన్నారు. థాంగ్ టా మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ రిఫరీ సూరిబాబు, ధాంగ్ టా మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, లైజింగ్ అధికారి ఆర్‌కేడీ ప్రసాద్, స్టూడెంట్ ఇంటర్నేషనల్ కోఫ్‌కన్ కరాటే ఇన్‌స్ట్రక్చర్ బాకూరు పాండురాజు, సుటోఖాన్ తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కోచ్ రాజేశ్వరరావు, సుమన్ సుటోఖాన్ కరాటే అసోసియేషన్ ఇన్‌స్ట్రక్చర్ నందకదొర రామారావును ఎమ్మెల్యే శాలువా కప్పి సత్కరించారు. ఈ పోటీల్లో 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజిరావు, పీడీలు భూపతిరాజు, కొండబాబులతో పాటు పలు జిల్లాల క్రీడాకారులు, కోచ్‌లు, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస
విశ్వేశ్వరరాజు
పాడేరులో అంతర్ జిల్లాల థాంగ్ టా మార్షల్ ఆర్ట్స్ పోటీలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment