ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
దేవీపట్నం: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ కోరారు. బుధవారం ఇందుకూరుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తారని తెలిపారు. అనంతరం యంత్రాలతో వరి కోతలను సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విశ్వనాథచౌదరి, తహసీల్దార్ సత్యనారాయణ, థేవో ప్రశాంతి, సివిల్ సప్లయి అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment