చెరువులవేనం వ్యూపాయింట్ మూసివేత
తాత్కాలికంగా చెక్‌పోస్టు ఏర్పాటు
చింతపల్లి: భారీ వర్షాల నేపథ్యంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని చెరువులవేనం వ్యూపాయింట్‌ను తాత్కాలికంగా మూసివేసినట్టు తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పర్యాటక సీజన్ కావడంతో వారాంతాల్లో దూర ప్రాంతాలనుంచి పర్యాటకులు వస్తున్నారన్నారు. చెరువులవేనం కొండపైకి వెళ్లే ప్రధాన రహదారి అసంపూర్తిగా ఉండటంతోపాటు కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్నారు. అందువల్ల ఈ రహదారిని తాత్కాలికంగా మూసివేయాలని కలెక్టర్ ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బందిని పంపించి తాత్కాలికంగా రహదారిని మూసివేసినట్టు ఆయన పేర్కొన్నారు. అక్కడ ప్రధాన మార్గంలో తాత్కాలిక చెక్‌పోస్టును ఏర్పాటుచేసినట్టు తహసీల్దార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment