మళ్లీ తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
చింతపల్లి: మన్యంలో మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇటీవల అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. శీతల గాలులు, చలితీవ్రత, మంచు ప్రభావం తగ్గింది. కనిష్టఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. ఆదివారం జి.మాడుగులలో 11.7 డిగ్రీలు, పెదబయలులో 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, వాతావరణ విభాగం నోడల్ అఽధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి డుంబ్రిగుడ, జీకేవీధిలో 12.8 డిగ్రీలు, అరుకువేలిలో 12.9 డిగ్రీలు, ముంచంగిపుట్టు, హుకుంపేటలో 13.4 డిగ్రీలు, పాడేరులో 13.9 డిగ్రీలు, చింతపల్లిలో 14.6 డిగ్రీలు, అనంతగిరిలో 14.7 డిగ్రీలు, కొయ్యూరులో 16.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు.
మంచు ముసుగులో మన్యం
డుంబ్రిగుడ: మండల కేంద్రంలో భారీగా మంచుకురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత మూడు రోజులుగా వర్షాలు ప్రభావంతో ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా మంచు కురవడంతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో సమస్యలు ఎదుర్కొన్నారు.
పెరుగుతున్న చలి తీవ్రత
జి.మాడుగులలో 11.7, పెదబయలులో 12.5 డిగ్రీల నమోదు
Comments
Please login to add a commentAdd a comment