అరకు చలి ఉత్సవ్‌తో ఒదిగేదేమీ లేదు
ఎమ్మెల్యేలు విశ్వేశ్వరాజు, రేగం మత్స్య లింగం
డుంబ్రిగుడ : అరకులోయ చలి ఉత్సవ్ వల్ల గిరిజనులకు ఒరిగేదేమీ లేదని, కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగ ం మత్స్యలింగం అన్నారు. ఆదివాసీ ప్రాంతంలో 1/70 చట్ట సవరణ ద్వారానే ఏజెన్సీప్రాంతాల్లో పెట్టుబడులు వస్తాయని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడడం బాధాకరమని చెప్పారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు అరకులోయ వస్తుండగా మార్గ మధ్యంలో జైపూర్ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన చట్టాలను పటిష్టంగా అమలుపరిచి, విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే ఏ ఉత్సవాలైనా నిర్వహించాలని తెలిపారు. చలి ఉత్సవాల సందర్భంగా వినోదం అందించేందుకు ఏర్పాటుచేసిన హెలికాప్టర్‌లో ప్రయాణించడానికి ఒక్కొక్కరి నుంచి రూ.4,000 చార్జీ వసూలు చేయడం దారుణమన్నారు. వ్యాపారం కోసమే గిరిజన సంప్రదాయ ఉత్సవాల ముసుగులో అరకు చలి ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి పాంగి చిన్నారావు, డుంబ్రిగుడ మండలం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చిక్కుడు మల్లేశ్వరరావు, డుంబ్రిగడ మండలం సర్పంచ్ కిముడు హరి, సర్పంచ్ ఒరబోయి న సుబ్బారావు, ఎంపీటీసీలు దురియా ఆనంద్,సమర్ది శత్రుగుణ, వైఎస్సార్‌సీపీ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు తేడబారికి సురేష్ కుమార్, వైఎస్సార్‌సీపీ అరకు అసెంబ్లీ బీసీ సెల్ అధ్యక్షుడు గెడ్డం నరసింగరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి జన్నీ నరసింహమూరి, నాయకులు పాంగి పరశురామ్ , శెట్టి అప్పాలు,కూడ సుబ్రమణ్యం, జాని, బాబూరావు, రామమూర్తి, అర్జున్,బాలకష్ణ,బొంజుబాబు ,గుడివాడ ప్రకాష్, నాగేష్, శివ,మోహన్ రావు, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment