అరకు ఉత్సవ్‌లోపారా గ్లైడింగ్
● రైడర్ మనీష
అరకులోయ టౌన్: పూణేకు చెందిన కమిషనర్ ఆఫ్ పారా గ్లైడింగ్ ఎరోక్లబ్ ఆఫ్ ఇండియా విజయ సోని నేతృత్వంలో అరకు చలి ఉత్సవ్‌లో రైడింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద రైడింగ్ ఏర్పాటు చేశామన్నారు. పర్యాటక శాఖ ఆహ్వానం మేరకు అరకు చలి ఉత్సవ్‌లో పారా గ్లైడింగ్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. వారం రోజుల క్రితం నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతం కావడంతో ఉత్సవ్‌లో రైడింగ్ చేపట్టామన్నారు. అల్లూరి జిల్లా పర్యాటకంగా పుంతలు తొక్కుతుందన్నారు. ఈ ప్రాంతానికి భవిష్యత్తులో పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment