మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పరిశీలన

Published Thu, Feb 6 2025 2:05 AM | Last Updated on Thu, Feb 6 2025 2:04 AM

మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పరిశీలన

మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పరిశీలన

హుకుంపేట: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం మత్స్యగుండం వద్ద మహాశివరాత్రి జాతర కోసం చేస్తున్న ఏర్పాట్లను బుధవా రం సబ్‌ కలెక్టర్‌ సౌర్యమన్‌ పటేల్‌ పరిశీలించారు. అంతకుముందు ఆలయంలో మత్స్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ,ఆలయ కమిటీల సభ్యులు ఆయనను దుశ్శాలువాతో సన్మానించారు. అనంతరం మహాశివరాత్రి జాతర కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్‌ స్థలాలు, రెవెన్యూ, వైద్య, పోలీస్‌,అగ్నిమాపక,ఆర్టీసీ సిబ్బంది విధుల్లో ఉండే ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాయుడు, ఆర్‌ఐ సీతమ్మ,ఆలయ కమిటీ సభ్యుడు అప్పారావు, ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గోపాలపాత్రుడు, పాంగి మత్స్య కొండబాబు, సభ్యులు ఆనంద్‌, బాలయ్య,హరినాఽథ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement