పెదబయలు పాఠశాలకు హరిత విద్యాలయ అవార్డు
పెదబయలు: స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర–1 పాఠశాలకు జాతీయ స్థాయిలో హరిత విద్యాలయం అవార్డు లభించింది. ఈ నెల 4న న్యూఢిల్లీలో ఈ అవార్డును ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత నారాయణ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్‌చుక్ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోప్యాధాయుడు టి.నాగేశ్వరరావు, ఎన్‌సీసీ క్లస్టర్ కోఆర్డినేటర్, గ్రీన్ టీచర్ చెండా బాలకృష్ణ అందుకున్నారు. పాఠశాలలో నీటి సంరక్షణ, జీవవైవిధ్యం, పరిశుభ్రత, ఎనర్జీ కన్జర్వేషన్ తదితర పలు పర్యావరణహిత కార్యక్రమాల నిర్వహణ, వివిధ రకాల ఔషధ మొక్కల పెంపకం, ఎకో గ్రూపులను ఏర్పాటు చేసి విద్యార్థులను భాగస్వాములను చేసినందుకు హరిత విద్యాలయం అవార్డు లభించినట్టు హెచ్‌ఎం తెలిపారు. నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ఈ అవార్డుకు తమ పాఠశాలను ఎంపిక చేసినట్టు చెప్పారు.జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment