క్రీడాకారుడు రోహిత్‌కు ఆర్థిక సాయం
సాక్షి,పాడేరు: విజయవాడలో ఈనెల 9న జరగనున్న జాతీయ క్రీడల్లో పాల్గోనున్న అథ్లెటిక్ క్రీడాకారుడు శెట్టి రోహిత్‌కు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ బుధవారం తన కార్యాలయంలో రోహిత్‌కు రూ.20వేలు అందజేశారు. డుంబ్రిగుడ మండలం గేదెలబంద గ్రామానికి చెందిన శెట్టి రోహిత్ అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రాష్ట్ర,జాతీయ స్థాయి పరుగు పోటీల్లో పాల్గొని ఇప్పటికి 35 బంగారుపతకాలు సాధించాడు.ఈమేరకు రోహిత్‌ను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు. తన కుమారుడికి ఆర్థిక సాయం అందజేసిన కలెక్టర్‌కు రోహిత్ తండ్రి శెట్టి సంజీవ్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment