మార్చి 17 నుంచిఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

మార్చి 17 నుంచిఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు

Published Thu, Feb 6 2025 2:05 AM | Last Updated on Thu, Feb 6 2025 2:05 AM

-

జిల్లాలో 18 కేంద్రాల ఏర్పాటు

సాక్షి,పాడేరు: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్‌ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ బుధవారం విడుదలైనట్టు డీఈవో పి.బ్రహ్మాజీరావు, పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌.శశికుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 17న హిందీ, 19న ఇంగ్లిష్‌, 21న తెలుగు/ఉర్దూ/కన్నడ/తమిళం,24న గణితం/భారతీయ సంస్కృతి మరియు వారసత్వం, 26న శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానం/గృహ విజ్ఞాన శాస్త్రం,28న సాంఘిక శాస్త్రం/ఆర్థిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అరకులోయలో 3,పాడేరులో 3,చింతూరులో 3,చింతపల్లిలో 4,రంపచోడవరంలో 5 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement