కలాసీలపై దాడి చేసిన ఇద్దరు విద్యార్థులు, ఆటో డ్రైవర్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కలాసీలపై దాడి చేసిన ఇద్దరు విద్యార్థులు, ఆటో డ్రైవర్‌ అరెస్టు

Published Sat, Nov 23 2024 1:28 AM | Last Updated on Sat, Nov 23 2024 1:28 AM

-

రాంబిల్లి (యలమంచిలి): రాంబిల్లి మండలం ఎస్‌ఈజెడ్‌ ప్రాంతంలో ఈనెల 20వ తేదీన కలాసీలపై దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి అచ్యుతాపురం మండలం, పూడిమడక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌, ఇద్దరు విద్యార్థులను శుక్రవారం అరెస్టు చేసినట్లు రాంబిల్లి పోలీసులు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతమైన రాంబిల్లి ఎస్‌ఈజెడ్‌లో పని చేస్తున్న కలాసీలపై పూడిమడక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ మైలపల్లి జగదీష్‌ (22), ఐటీఐ, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గనగళ్ల భాను (20), పుక్కల నవీన్‌ దాడి చేశారు. దీంతో పలువురు కలాసీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు రాంబిల్లి సీఐ సీహెచ్‌ నర్సింగరావు కేసు నమెదు చేసి నిందితులను యలమంచిలి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కేసులు నమెదు చేసి కఠన చర్యలు తీసుకుంటామని రాంబిల్లి సీఐ సీహెచ్‌ నర్సింగరావు హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement