చూసిన కనులదే భాగ్యం
ఎస్.రాయవరం: మండల కేంద్రం ఎస్.రాయవరంలో శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి దివ్యలీలా కల్యాణం... చూసిన కనులదే భాగ్యం అన్న చందంగా సాగింది. వందల సంఖ్యలో దంపతులు స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందు స్వామి వారి ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో ఊరేగించారు. సుమారు 10 గ్రామాల నుంచి వచ్చిన కోలాట, తప్పెటగుళ్ల బృందాల ఆటపాటలు, సన్నాయిమేళాల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పాయకరావుపేట నియోజక వర్గ ఇన్చార్జ్ కంబాల జోగులు, స్థానిక పెద్దలు బొలిశెట్టి శ్రీనివాసరావు, గోవిందరావు, కొణతాల శ్రీనివాసరావు, లక్కోజుదిమూర్తి, సర్పంచ్ భూపతి అప్పారావు, ఎంపీటీసీ బైపా శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ శారదాకుమారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దేపల్లి బొజ్జన్న తదితరులు స్వామి పల్లకీని మోసారు.అనంతరం సాయంత్రం కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు చక్రవర్తి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ ధర్మకర్త బొలిశెట్టి గోవిందరావు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
అంగరంగ వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
చూసితరించిన భక్తజనం
గోవింద నామస్మరణతో మార్మోగిన క్షేత్రం
Comments
Please login to add a commentAdd a comment