‘మా భూములను సర్వే చేయడానికి వీల్లేదు’
నక్కపల్లి: బలవంతంగా తమ భూములను సర్వే చేయవద్దని, తక్షణమే నిలిపివేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. తమ ప్రమేయం లేకుండా భూములు సర్వేచేయడం తగదని వారు తెలిపారు. భూముల సర్వేపై శుక్రవారం పెదతీనార్లలో పలువురు రైతులు, నాయకులు విలేకరులతో మాట్లాడుతూ ఎందుకు తమ భూములను సర్వే చేస్తున్నారని ప్రశ్నించారు. రైతు సంఘనాయకులు ఎం.అప్పలరాజు, శివాజీరాజు, కొర్లయ్య, అప్పలకొండరాజు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. భూసేకరణ చేయాలంటే ముందుగా రైతులకు నోటీసులు జారీ చేయాలని, వారి అనుమతితోనే భూములు సర్వే చేయాలన్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్నాయన్నారు. కొద్దిరోజులుగా అధికారులు భూములను సర్వేచేస్తున్నారన్నారు. అడిగితే సరైన సమాధానం చెప్పడం లేద న్నారు. ఎందుకోసం, ఎవరి కోసం భూములు సర్వేచేస్తున్నారని ప్రశ్నించారు.అధికారుల చర్యలు రైతు ల హక్కులను కాలారాసేలా ఉన్నాయని చెప్పారు. భూముల సర్వేను వెంటనే నిలిపివేయాలని, లేక పోతే రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్య మం చేస్తామని చెప్పారు. భూములు ఎందుకు సర్వేచేస్తున్నారన్న విషయాన్ని గ్రామసభల ద్వారా రైతులకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో ఎం.రాజేష్, బుజ్జి, బగాది రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment