ఓవర్‌లోడు వాహనదారుల లైసెన్స్‌లు రద్దు
అనకాపల్లి: మండల పరిధిలోగల క్వారీల నుంచి లారీల్లో పరిమితికి మించి లోడు వేసుకుని రవాణా చేసినట్టయితే డ్రైవర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని డీఎస్పీ ఎం.శ్రావణి హెచ్చరించారు. మండలంలో కొత్తూరు బ్రిడ్జి వద్ద శుక్రవారం తనిఖీలు నిర్వహించి అధికలోడుతో వెళుతున్న లారీలను పట్టుకున్నారు. వాటిని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించి కేసులు నమోదు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక లోడు వాహనాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, లారీల నుంచి క్వారీ మెటీరియల్ పడి ద్విచక్రవాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన చోదకుల లైసెన్స్‌లు నిలుపుదల చేస్తామని, వాహనాల పర్మిట్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ, ఎస్ఐలు పాల్గొన్నారు.
డీఎస్పీ శ్రావణి హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment