ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ ఎదుట ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) డిపో అధ్యక్షుడు బి.అప్పారావు, కార్యదర్శి పరమేశ్వరరావు మాట్లాడుతూ పని ష్మెంట్లు ఒకే విధంగా ఉండాలని కోరారు. బస్సుల్లో టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికులపైనే పెట్టాలని, సర్కులర్ నంబర్ 70,71 లలో మార్పు చేయాలని, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఏడీసీలు,సూపర్వైజర్లు, ఆఫీస్ సిబ్బందిపై అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కొత్తబస్సు లు కొనుగోలు చేయాలని, పెండింగ్ మెడికల్ బిల్లులు విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసి, ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు పలకా సత్యనారాయణ, త్రిమూర్తులు, ఎస్.రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment