అయ్యప్ప భక్తుల కోసం శ్రీకాకుళం–కొల్లాం మధ్య రైలు
తాటిచెట్లపాలెం: అయ్యప్ప భక్తుల కోసం శ్రీకాకుళం రోడ్–కొల్లాం– శ్రీకాకుళం రోడ్ మధ్య వాల్తేర్ డివిజన్ స్పెషల్ రైళ్లు నడుపుతోంది. ప్రస్తుతం నడుస్తున్న విశాఖ–కొల్లాం రైలును ఫిబ్రవరి వరకు పొడిగించింది.
● శ్రీకాకుళం రోడ్–కొల్లాం(08553) స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్రతీ ఆదివారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి 8.47 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 8.52 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జన వరి 26 వరకు నడుస్తుంది. కొల్లాం–శ్రీకాకుళం రోడ్ (08554) స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్రతీ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కొల్లాంలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 10.35 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి రాత్రి 10.40 గంటలకు బయల్దేరి శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది.
● విశాఖ–కొల్లాం(08539) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్రతీ బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయల్దేరి గురువారం మధ్యాహ్నం 12.55గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 26వ తేదీ వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో ప్రతీ గురువారం కొల్లాంలో రాత్రి 7.35 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment