సమస్యలు పరిష్కరించాకే నేవీ రక్షణ గోడ నిర్మాణం
● పనులు అడ్డుకున్న కొప్పుగొండు గ్రామ ప్రజలు
రాంబిల్లి (యలమంచిలి): తమ సమస్యలు పరిష్కరించాకే నేవల్‌బేస్ రక్షణ గోడ నిర్మాణ పనులు చేపట్టాలని రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. కొప్పుగొండుపాలెం గ్రామ సమీపంలో జరుగుతున్న నేవల్‌బేస్ రక్షణ గోడ నిర్మాణ పనులను గురువారం వారు అడ్డుకొన్నారు. నేవల్‌బేస్ రక్షణ గోడ నిర్మాణం వలన పొలాల్లోకి దారి లేక ఇబ్బందులు పడుతున్నామని, కొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం వలన ఉపాధి కోల్పోయామని వారు పేర్కొన్నారు. రుద్రభూమి లేక ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు సమస్య ఏర్పడిందన్నారు. గతంలో ప్రభుత్వ అధికారులు తమ డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ అవి అమలు కాలేదన్నారు. తమ ఇక్కట్లు తీర్చకుండా నేవీ నిర్మాణ పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment