నేడు ‘వైఎస్సార్‌సీపీ పోరుబాట’
● అన్ని నియోజకవర్గాల్లో విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన
సాక్షి, అనకాపల్లి: విద్యుత్ చార్జీల బాదుడుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించే ‘వైఎస్సార్‌సీపీ పోరుబాట’ను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించి ప్రజలపై భారం మోపుతున్న కూటమి ప్రభుత్వం కపట నాటకాన్ని ఎండగట్టేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అనకాపల్లి, మాడుగుల, నర్సీపట్నం, చోడవరం, పాయకరావుపేట, యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి పాదయాత్ర, ర్యాలీ, బైక్ ర్యాలీగా నియోజకవర్గ కేంద్రంలో విద్యుత్ కార్యాలయాలకు వద్దకు వెళ్లి వినతి పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొని పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment