ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల
తుమ్మపాల: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ, తెలంగాణ యువతకు అగ్నివీర్ వాయు, మెడికల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ ట్రేడ్‌లలో ఎయిర్‌మెన్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంటు అధికారి, కమాండింగ్ అధికారి గురుపీత్ అట్వాల్ ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసినట్లు తెలిపారు. అగ్నివీర్ వాయు ఇంటెక్ 01/2026 కోసం ప్రవేశం నోటిఫికేషన్ వివరాలు agnipathvayu. cdac.inలో అందుబాటులో ఉన్నాయని, మెడికల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ ట్రేడ్‌లలో ఎయిర్‌మెన్ ఉద్యోగాలు ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ద్వారా ఎంపిక చేస్తారన్నారు. నోటిఫికేషన్ వివరాలు airmenselection.cdac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చని సూచించా రు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో యువత రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనాలని ఆమె ఆకాక్షించారు.
తుమ్మపాల: పట్టణంలో ముఠా కార్మికులు, వర్తక సంఘం ప్రతినిధుల మధ్య లేబర్ ఆఫీసులో శుక్రవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తొలుత కూలి రేట్లు 50 శాతం పెంచాలని డిమాండ్ చేసిన కార్మికులు 35 శాతం వరకు దిగి వచ్చారు. వర్తక సంఘం ప్రతినిధులు కేవలం 14 శాతం మాత్రమే పెంచుతామనడంతో ఇరు వర్గాలకు ఏకాభిప్రాయం కుదరలేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు తెలిపారు. దీంతో లేబర్ అధికారులు చర్చలను శనివారం సాయంత్రం 4 గంటలకు వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment