సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికుల ధర్నా
చోడవరం: కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అంత వరకూ విధుల్లోకి వెళ్లమంటూ గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులంతా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు ధర్నా చేశారు. ఫ్యాక్టరీ ఆవరణలో శుక్రవారం విధి నిర్వహణలో ఉన్న కార్మికులంతా విధులను నిలిపివేసి గేటు బయటకు వచ్చి సెక్యూరిటీ గేటు వద్ద ఽబైఠాయించి ధర్నా చేశారు. కార్మికుల రావలసిన జీతభత్యాలు నేటి వరకూ చెల్లించలేదని, రెండేళ్లుగా కార్మికులకు ఇవ్వాల్సిన ఓటీ డబ్బు ఇవ్వలేదని, గత ఏడాది నుంచి డీవోలు ఇవ్వలేదని, ఇవన్నీ వెంటనే చెల్లించాలని కార్మిక సంఘం అధ్యక్షుడు కె.వి.వి. భాస్కరరావు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కారణంగా ఓవరాయిలింగ్ పనులకు కొంత మేర ఇబ్బంది ఏర్పడింది. మరో వారం రోజుల్లో రెగ్యులర్ క్రషింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో కార్మికులు ఆందోళనకు దిగడంతో సమస్య పరిష్కరించే దిశగా యాజమాన్యం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment