తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
మాకవరపాలెం తహసీల్దార్ కార్యాలయం
మాకవరపాలెం : తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. గత నెల 8న భూమి మ్యుటేషన్ చేసేందుకు రూ.15,000 లంచం తీసుకుంటూ తామరం వీఆర్వో లక్షణరావు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఏసీబీ అధికారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం నుంచి వివిధ రికార్డులను పరిశీలించారు. కంప్యూటర్లో పొందుపరిచిన ఆన్లైన్ భూ రికార్డులను కూడా తనిఖీలు చేశారు. పలు అంశాలకు సంబందించి వివరాలు నమోదు చేసుకున్నారు. గత నెల వరకు భూములు ఆన్లైన్ చేసే కంప్యూటర్ ఆపరేటర్‌తో కూడా మాట్లాడి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. సుమారు ఐదు గంటలపాటు జరిగిన ఏసీబీ అధికారుల తనిఖీలతో మరోసారి రెవెన్యూ సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment