సాక్షి, అనకాపల్లి : కూటమి ప్రభుత్వంలో ఎఫ్‌పీ షాప్ డీలర్ల ఎంపిక పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. అధికారులు ప్రతిభకు అన్యాయం చేసి మెరిట్ లేని వారికి అడ్డదారుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఈ నెల 26న జరిగిన అనకాపల్లి ఎఫ్‌పీ షాప్ డీలర్స్ ఎంపిక పరీక్షలో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ పేరుతో తక్కువ మార్కులు వేసి తీవ్ర అన్యాయానికి పాల్పడ్డారు. దేవరపు ప్రసాద్ అనే వ్యక్తికి రాత పరీక్షలో 64 మార్కులు వచ్చాయి. ఆయనకు అనకాపల్లి యలమంచిలి – 2 డిపోలో మొదటి స్థానం, అలాగే జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి 10 మందిలో ఒక్కడు. అయితే ప్రసాద్‌కు తరువాత జరిగిన ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పినప్పటికీ కేవలం 5 మార్కులు మాత్రమే వేసి...మొత్తం (ఫలితంగా )64+5=69 మార్కులతో మెరిట్ లిస్ట్‌లో రెండో స్థానానికి మార్చారు. అదే అతనితో పాటు రాసిన రాత పరీక్షలో 53 మార్కులు మాత్రమే వచ్చిన ఒక వ్యక్తికి ఇంటర్వ్యూలో 18 మార్కులు వేసి 53+18=71 మార్కులతో మొదటి ప్లేస్ ఇచ్చేసారు. యలమంచిలి –2 డిపో మాత్రమే కాకుండా మరి కొన్ని డిపాల్లో కూడా రాత పరీక్షలో అత్యధిక మార్కులు వచ్చినప్పటికి, ఇంటర్వ్యూ లో కేవలం 2, 3, 4 మార్కులు మాత్రమే వేసి కిందికి నెట్టేస్తున్నారు. రాత పరీక్ష మెరిట్లో 4, 5 స్థానంలో ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలో 18 మార్కులు ఇవ్వడంతో కింది నుంచి టాప్ స్థానానికి తీసుకొస్తున్నారు. రాజకీయ ఒత్తిడికి లోబడి...అదేవిధంగా అధికారులు చేతివాటం చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment