ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
తుమ్మపాల : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పక్కాగా చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అచ్యుతాపురం, నక్కపల్లిలో శంకుస్థాపన కార్యక్రమాలను విశాఖపట్నంలో నిర్వహించే బహిరంగసభ నుండి వర్చువల్‌గా నిర్వహిస్తారని, ఇక్కడి ప్రజలతో ముఖాముఖి సంభాషిస్తారని ఆమె తెలిపారు. ప్రధాని పర్యటన కార్యక్రమం విజయవంతం చేయుటకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అచ్యుతాపురంలో అనకాపల్లి రెవెన్యూ డివిజినల్ అధికారి షేక్ ఆయిషా, నక్కపల్లిలో నర్సీపట్నం రెవెన్యూ డివిజినల్ అధికారి వి.వి.రమణలకు వర్చువల్ ఏర్పాట్లు బాధ్యతలు అప్పగించారు. బస్సులు, భోజన ఏర్పాట్ల బాధ్యతలను జిల్లా రవాణా అధికారి, సివిల్ సప్లయి అధికారి, జిల్లా పంచాయతీ అధికారులకు అప్పగించారు. సమన్వయంతో ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మొత్తం కార్యక్రమం సమన్వయం చేసుకోవడానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment