విచారణ నివేదికప్రభుత్వానికి సమర్పించాం..
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో జరిగిన సంఘటనపై వైద్య సిబ్బందితో పాటు అక్కడ విధుల్లో ఉన్న వైద్యులను, ఇన్‌చార్జి సూపరింటెండెంట్, బాధిత కుటుంబ సభ్యులను విచారించాం. వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ డ్యూటీలోనే ఉన్నారు. ఉమ్మునీరు పోవడం, బీపీ తగ్గిపోవడం వంటి కారణాలతో 10 నిమిషాల వ్యవధిలోనే ప్రాణ నష్టం జరిగింది. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాం. ప్రసవాల విషయంలో నర్సీపట్నం ఏరియా ఆస్ప త్రికి రాష్ట్రంలోనే మంచి పేరు ఉంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. రెండవ కాన్పు సమయంలో గర్భిణి, ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ మరణించడం బాధాకరం.
– డాక్టర్ రమేష్ కిశోర్,
వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment