జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు గురుకుల విద్యార్థి
విద్యార్థి తరుణ్‌ను అభినందిస్తున్నతెనుగుపూడి గురుకుల ఉపాధ్యాయులు
దేవరాపల్లి: జాతీయ స్థాయి అండర్–14 ఖోఖో పోటీలకు మండలంలోని తెనుగుపూడి డాక్టరు బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయానికి చెందిన 8వ తరగతి విద్యార్థి రొంగలి తరుణ్ ఎంపికయ్యాడు. ఇటీవల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్ పి. రఘు తెలిపారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో ఈ నెల 9 నుంచి 13 వరకు జరిగే జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–14 విభాగపు పోటీల్లో పాల్గొంటాడన్నారు. తరుణ్‌ను, వ్యాయామ ఉపాధ్యాయులు జి. తరుణేశ్వరరావు, ఎస్. నాగేశ్వరరావులను ఉమ్మడి జిల్లా గురుకుల విద్యాలయాల ఇన్‌చార్జి సమన్వయ అధికారి జి. గ్రేస్, ప్రిన్సిపాల్ రఘు, ఎస్‌ఎంసీ చైర్మన్ ఇరటా నర్సింహమూర్తి, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment