వైకుంఠ ఏకాదశికి సింహాచలం టికెట్ల విక్రయాలు
సింహాచలం: ఈ నెల 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శన ప్రత్యేక టికెట్ల (రూ.500) విక్రయాలను దేవస్థానం అధికారులు సోమవారం ప్రారంభించారు. సింహగిరిపైనున్న పీఆర్వో కార్యాలయంలో టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. దేవస్థానం ఏఈవో ఆనంద్‌కుమార్, ప్రొటోకాల్ సూపరింటెండెంట్ విక్రమ్‌లు పలాస ప్రాంతానికి చెందిన పలువురు భక్తులకు తొలి టిక్కెట్లను విక్రయించారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పీఆర్వో కార్యాలయంలో టిక్కెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు. ఆన్‌లైన్‌లో కొనాలనుకునేవారు www.aptemples. ap.gov.inలో టిక్కెట్లు పొందవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment