చమ్మచింతలో అధికారులకు చుక్కెదురు
నాతవరం : తహసీల్దార్ లేకుండా భూ సమస్యలు పరిష్కరించకుండా మొక్కుబడిగా నిర్వహించే రెవెన్యూ సదస్సు ఎందుకని రైతులు అడ్డగించారు. మండలంలో చమ్మచింత గ్రామంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ శివ ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ లేకుండా రెవెన్యూ సదస్సు దిగువ స్థాయి అధికారులతో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో 1/70 యాక్టు పరిధిలో ఉంది, ఇక్కడ 95 శాతం ఓసీ, బీసీ ఎస్సీ కులస్తులు పూర్వం నుంచి జీవనం సాగిస్తున్నారు. 1978 వరకు ఇక్కడ భూముల క్రయ విక్రయాలు, రిజిష్ట్రేషన్లు జరిగేవి. 2018 వరకు తాత తల్లిదండ్రులు భూములు తమ కుటుంబ సభ్యుల పేర్లు మీద రెవెన్యూ అధికారులు మార్పు చేసేవారు. తర్వాత నుంచి అధికారులు ఇక్కడ భూములు పట్టాదారులు పాసుపుస్తకాలు ఆన్‌లైన్ వెబ్‌ల్యాండ్ వంటి పనులు చేయకుండా నిలుపుదల చేశారు. పూర్వీకుల నుంచి సాగు చేసే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా ఆన్‌లైన్ నమోదు కాక ఆధార్ కార్డు నెంబర్లు లింక్ కాకపోవడం వన్‌బీ అడంగళ్ ఆన్‌లైన్ కాపీలు రావడం లేదు. ఈ సమస్యలన్నీ ప్రతిష్టత్మాకంగా నిర్వహించే రెవెన్యూ సదస్సులో తహసీల్దార్‌కు చెప్పుకునేందుకు రైతలు ఎంతో ఆశతో ఉన్నారు. సదస్సుకు తహసీల్దార్ రాకపోవడంతో రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకమై ఆందోళనకు దిగారు. సర్పంచ్ వెలకాడ కొండబాబు, ఉప సర్పంచ్ అప్పన దివాణం, మాజీ ఎంపీటీసీ సభ్యులు కాశపు నూకరాజు, నీటి సంఘం డైరెక్టరు సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు రైతులతో కలిసి రెవెన్యూ సదస్సు వద్ద ఆందోళన చేశారు. కనీస సమస్యలు పరిష్కరించని సదస్సు ఎందుకని నినాదాలు చేశారు. సదస్సు వద్ద టెంట్లు, కుర్చీలు తొలగించే ప్రయత్నం చేశారు. రెవెన్యూ సిబ్బంది ఇక్కడ్నుంచి వెళ్లిపోండి భూ సమస్యలు పరిష్కరిస్తేనే సదస్సు పెట్టాలని డిమాండ్ చేశారు.
తాము ఏళ్ల తరబడి బాధలు పడుతున్నామని, ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగే భూ రీసర్వే సైతం నిలుపుదల చేసిందన్నారు. అనంతరం రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ శివ మాట్లాడుతూ తహసీల్దార్ అదేశాల ప్రకారమే నేను రెవెన్యూ సదస్సు నిర్వహించేందుకు వచ్చానన్నారు. మీ భూ సమస్యలు ఉంటే సభలో దరఖాస్తు చేస్తే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తాన్నారు. ఈ గ్రామంలో 1/70 యాక్టు పరిధిలో ఉందని గిరిజనులకు తప్ప ఇతరులకు తాము ఏమీ చేయలేమని, కుల ధ్రవీకరణ, మరణ సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో మండల సర్వేయరు ప్రసాద్, వీఆర్వోలు సిబ్బంది పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సును అడ్డుకున్న గ్రామస్తులు
తహసీల్దార్ లేకుండా నిర్వహణపై ఆగ్రహం
తమ భూములు ఆన్‌లైన్‌లో తొలగింపుపై రైతుల నిరసన
టెంట్లు, కుర్చీలు తొలగించే ప్రయత్నం
Comments
Please login to add a commentAdd a comment