రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక
చోడవరం రూరల్/రోలుగుంట: రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు చోడవరం మండలం లక్ష్మీపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ముర్రు రమేష్ రూపొందించిన యాంటీ సూసైడల్ ఫ్యాన్ ప్రాజెక్టు, రోలుగుంట మండలం కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు ఆర్. అవినాస్, ఎ.భార్గవ్ తయారు చేసిన ఫైర్ అలారం ఎంపికయ్యాయి. ఇటీవల కశింకోటలో జిల్లా స్థాయి సైన్సు ఫెయిర్‌లో వీరు సత్తా చాటారు. విజయవాడలో ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం కై వసం చేసుకోవాలని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ఎ.వి.జగన్నాథరావు, శెట్టి మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment