12,91,044
జిల్లాలో ఓటర్లు...
తుమ్మపాల : ఓటరు జాబితా ప్రచురణ – 2025 ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్లు 12,91,044 మందితో సోమవారం తుది జాబితా ప్రచురించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 29 ప్రచురించిన జాబితా ప్రకారం 3,044 మందిని ఓటర్ల జాబితాలో నమోదు చేయగా, 1,870 మంది మరణం, డబుల్ ఎంట్రీ, వలస ఓటర్లుగా గుర్తించి తొలగించడమైందన్నారు. జిల్లాలో పురుషులు మొత్తం 6,27,984 మంది, సీ్త్రలు 6,63,032 మంది, థర్డ్ జెండర్ 28 మంది ఉన్నారన్నా రు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు 17,225 మంది ఉన్నారన్నారు. సర్వీస్ ఓటర్లు ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 3,987 మంది కాగా వారిలో పురుషులు 3,851, సీ్త్రలు 136 మంది ఉన్నారు. ఈ మేరకు జాబితాను అన్ని నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయాల్లోను, అన్ని పోలింగ్ బూత్‌లలో ప్రచురించడడం జరిగిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment