బల్క్ డ్రగ్‌పార్క్ ఏర్పాటు విరమించుకోవాలి
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో బల్క్ డ్రగ్‌పార్క్ ఏర్పాటును విరమించుకోవాలని సీపీఎం నాయకులు,పలువురు రైతులు డిమాండ్ చేశారు. రాజయ్యపేటలో పార్క్ ఏర్పాటును నిరసిస్తూ శనివారం ఆందోళన నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.లోకనాథం,జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఎం.అప్పలరాజుమాట్లాడుతూ మత్స్యకారులు, వ్యవసాయ కూలీలు, రైతులు, చేతివృత్తుల వారి ఉపాధిని దెబ్బతీసే బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తోందన్నారు. పూర్తిస్థాయిలో నష్టపరిహారం,ప్యా కేజీ చెల్లించకుండా కొబ్బరి,జీడితోటలు తొలగించడం అన్యాయమని తెలిపారు.నిర్వాసితుల కుటుంబాల్లో మేజర్లకు రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఆర్.కార్డులు ఇవ్వాల ని,ఉద్యోగాలు కల్పించాలన్నారు. రైతుల సమస్యలపై పోరాటాలకు అన్ని పార్టీలు కలసి రావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment