విన్యాసాలు సాగాయిలా..
●
●
● భారత నావికాదళం అద్భుతమైన విన్యాసాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముందుగా జాతీయ, నావికాదళ పతాకాలను ఎగురవేశారు. నావికాదళ వాద్య బృందం శ్రావ్యమైన జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ఆరంభమైంది. అనంతరం చేతక్ హెలికాప్టర్లు త్రివర్ణ పతాకం, నావికాదళ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఆకాశంలో విహరించాయి.
● విపత్కర పరిస్థితుల్లో బందీలను విడిపించడానికి మెరుపుదాడి చేసే మైరెన్ కమాండోల(మార్కోస్) విన్యాసాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో సముద్రంలోకి దిగిన కమాండోలు, వెంటనే బోటులో తీరానికి చేరుకుని బందీలను విడిపించిన తీరు ఉత్కంఠభరితంగా సాగింది. వారి ధైర్యసాహసాలకు ప్రజలు సెల్యూట్ చేశారు. ఆయిల్ రిగ్ పేల్చివేత విన్యాసం ప్రేక్షకులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
● ఆకాశం నుంచి నాలుగు పారాచూట్ల సాయంతో దిగిన మార్కోస్ బృందం ప్రత్యేక జ్ఞాపికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేసింది.
● ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ మైసూర్, ఐఎన్‌ఎస్ ఢిల్లీ యుద్ధ నౌకలపై హెలికాప్టర్లు, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు ల్యాండింగ్ అయిన విధానం విశేషంగా ఆకట్టుకుంది.
● తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ, శత్రువుల రాడార్లకు చిక్కకుండా సంచరించే హాక్ యుద్ధ విమానాల వ్యూహాత్మక విన్యాసాలు, నాలుగు చేతక్ హెలికాప్టర్ల విన్యాసాలు కనులపండువగా సాగాయి. అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ల అన్వేషణ, రక్షించే విధానాల ప్రదర్శన ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
● నావికాదళ సిబ్బంది విధులు, వారి జీవనశైలిని వివరిస్తూ సీ క్యాడెట్ కార్ప్స్ విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన లయబద్ధంగా సాగింది. యాంటీ సబ్‌మైరెన్ రాకెట్ ఫైరింగ్, యు ద్ధ నౌకల నుంచి చేసిన నమూనా కాల్పులు చూపరులను కట్టిపడేశాయి. చేతక్, సీ కింగ్ హెలికాప్టర్లు, డార్నియర్ హెలికాప్టర్, హాక్ జె ట్ ఫైటర్ల విన్యాసాలు ఉత్సాహాన్ని నింపాయి.
● చివరగా నావికాదళ వాద్య బృందం ప్రత్యేకంగా అందించిన బీటింగ్ రిట్రీట్, తుపాకులతో అగ్నిని రగిలించే కంటిన్యుటీ డ్రిల్ కవాతు, నౌకలపై మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల అలంకరణలు, బాణసంచా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఐఎన్‌ఎస్ సావిత్రి నుంచి నిర్వహించిన లేజర్ షో.. దేశభక్తి గీతాలకు అనుగుణంగా సాగింది. అంతర్జాతీయ ప్రమా ణాలతో నిర్వహించిన ఈ కార్యక్రమం అదరహో అనిపించింది. ప్రాచీన యుద్ధ కాలం నుంచి నేటి వరకు భారత రక్షణ వ్యవస్థ ప్రతిష్టను డ్రోన్ షో కళ్లకు కట్టినట్టు చూపించింది.
● నేవీ విన్యాసాల్లో ఎటువంటి అపశృతులు జరగకుండా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షించారు.
విన్యాసాలను తిలకిస్తున్న నగర ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment