పురుగుమందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
కె.కోటపాడు : మేడిచర్ల గ్రామానికి చెందిన రొంగలి కోటేశ్వరరావు (44) పురుగు మందు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. భర్త మృతిపై భార్య దేవి ఎ.కోడూరు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. ఎ.కోడూరు ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత నెల 28న కోటేశ్వరరావు అప్పుల బాధతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా పురుగుమందును సేవించాడు. కుమారుడు కిషోర్ గుర్తించి వెంటనే కె.కోటపాడు సీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. కేజిహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment