సింటర్ ప్లాంట్ కన్వేయర్ల పునరుద్ధరణ
ప్రారంభమైన సింటర్ ఉత్పత్తి
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ సింటర్ ప్లాంట్ విభాగంలో కన్వేయర్లు పునరుద్ధరించారు. దీంతో ఉత్పత్తి పునఃప్రారంభమైంది. సింటర్ ప్లాంట్ విభాగంలోని మూడు సింటర్ మిషన్లలో రెండు మిషన్లకు ముడి సరకు సరఫరా చేసే ఏ1, ఏ2 కన్వేయర్ల గ్యాలరీ ఈ నెల 3న కుప్ప కూలిన విషయం తెలిసిందే. దీంతో ఆ విభాగంలో సింటర్ ఉత్పత్తితోపాటు, రెండు బ్లాస్ట్‌ఫర్నేస్‌లలో పూర్తి ఉత్పత్తికి అంతరాయం కలిగింది. తద్వారా ఈ నాలుగు రోజులు హాట్ మెటల్ ఉత్పత్తి తగ్గింది.
రాత్రింబవళ్లు పునరుద్ధరణ పనులు చేపట్టారు. మంగళవారం ఉదయం ఏ2 కన్వేయర్, సాయంత్రం ఏ1 కన్వేయర్‌ను ప్రారంభించారు. దీంతో క్రమంగా ఉత్పత్తిని పెంచనున్నారు. ఒకట్రెండు రోజుల్లో రెండు బ్లాస్ట్‌ఫర్నేస్‌లలో ఉత్పత్తిని పూర్తి స్ధాయికి తీసుకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment