భార్య మందలించిందని వ్యక్తి ఆత్మహత్య
కె.కోటపాడు : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్య మందలించిందన్న కోపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన పిండ్రంగి గ్రామంలో చోటు చేసుకుంది. ఎ.కోడూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పిండ్రంగి గ్రామానికి చెందిన గొలగాని అప్పారావు(40) సోమవారం ఉదయమే మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఆయన్ను భార్య రామలక్ష్మి మందలించి పనికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన అప్పారావు ఇంట్లో ఉన్న పురుగు మందును తాగేశాడు. ఇంటికి వచ్చి రామలక్ష్మి చూసే సమయానికి భర్త అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే కె.కోటపాడు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అప్పారావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి శవాన్ని బంధువులకు అప్పగించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment