న్యాయంపూడిలో చోరీ
నక్కపల్లి: మండలంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న న్యాయంపూడి గ్రామంలో ఓ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. బాధితుడు నాగనబోయిన వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం రాత్రి తలుపు తాళాలు పగుల గొట్టి దుండగులు ప్రవేశించారు. కప్ బోర్డులో ఉన్న బీరువా తాళాలు తెరిచి లోపల ఉన్న రూ.3లక్షల విలువైన నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి వస్తువులు, రూ. 10 వేలు నగదు అపహరించారు. ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపులు పగుల గొట్టి బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగదు అపహరించిన విషయం గుర్తించిన వెంకటరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఎస్‌ఐ సన్నిబాబుతో పాటు క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment