వర్షాలతో అపరాలపంటలకు మేలు
అనకాపల్లి : రబీ సీజన్‌లో రైతులు అపరాలు, నువ్వులు స్వల్పకాలిక పంటల సాగుద్వారా అధిక ఆదాయం పొందవచ్చునని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ సీహెచ్.ముకుందరావు అన్నారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో శనివారం టీ అండ్ వి సమావేశం జరిగింది. ఈ సందర్భంగ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో కురిసిన అధిక వర్షాలు గత ఏడాది డిసెంబర్ నెలలో కురిసిన వర్షం వల్ల భూమిలో అధిక తేమ కలిగి ఉందని, దీని వల్ల రబీలో ఆరుతడి పంటలైన అపరాలు, నువ్వులు, ఇతర పంటలు వేసుకునేందుకు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. జిల్లా వ్యవసాయశాఖ ప్రతినిధి సీహెచ్.సుబ్రమణ్యం మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు ఆశాజనకంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment