ప్రధాని వర్చువల్ శంకుస్థాపన కోసం బహిరంగ సభ
నక్కపల్లి : ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్‌పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నంలోని ఏయు గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండల ప్రజలు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో తిలకించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రాజయ్యపేట సమీపంలో సుమారు 2 వేలమందితో ఈ బహిరంగ సభ నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ శంకుస్థాపన కార్యక్రమాన్ని పెద్ద టీవీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి మండల ప్రజలకు చూపించనున్నారు. రాజయ్యపేటలో జరిగే ఈ సభకు నాలుగు మండలాల నుంచి సుమారు 2 వేల మందిని తరలించనున్నారు. ఈ బహిరంగ సభకు హాజరైన వారిలో కొంతమందితో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడనున్నట్టు అధికారులు చెబుతున్నారు. సభ ఏర్పాట్ల బాధ్యతలను నర్సీపట్నం ఆర్‌డీవోకు అప్పగించారు. ఈ బహిరంగ సభలో స్థానిక ప్రజాప్రతినిధులు, అఽధికారులు ఏపీఐఐసీ అధికారులు పాల్గొననున్నారు. ఏర్పాట్లను శనివారం మండల ప్రత్యేకాధికారి ప్రసాద్, ఎంపీడీవో సీతారామరాజు పరిశీలించారు.
రాజయ్యపేట వద్ద చురుగ్గా ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment