నేవీ షో.. అదిరింది
ఆదివారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2025
ఏయూక్యాంపస్: విశాఖ సాగర తీరంలో భారత నావికాదళం సమర శంఖం పూరించింది. దేశ రక్షణలో నావికాదళం చేస్తున్న కృషిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించింది. బీచ్ రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా శనివారం సాయంత్రం నిర్వహించిన ఆపరేషనల్ డెమో ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. సాయంత్రం 4.40 గంటలకు ప్రారంభమైన విన్యాసాలు సుమారు గంటన్నర పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, తూర్పు నావికాదళ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీలు గొల్ల బాబూరావు, సీఎం రమేష్, మేయర్ హరివెంకటకుమారి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, బండారు సత్యనారాయణమూర్తి, కలెక్టర్ ఎం.ఎన్ హరేందిరప్రసాద్, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, నేవీ సిబ్బంది విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మారిటైం గేట్ వేగా ఏపీ అభివృద్ధి చెందుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment